Delhi Rains: దేశ రాజధానిని ముంచెత్తిన వాన

Delhi Rains: ఢిల్లీలో భారీ వర్షం * 19 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం

Update: 2021-09-02 03:30 GMT
ఢిల్లీ లో రికార్డు స్థాయి వర్షపాతం (ఫైల్ ఇమేజ్)

Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు ముంచెత్తుతోంది. 19 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో అత్యధిక వర్షాపాతం నమోదైంది. ఇవాళ తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ ఉదయం 6.30 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది. ఎయిమ్స్‌, రకబ్‌ గంజ్‌తో పాటు నగరం అంతటా వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం స్తంభించింది. రోడ్లపైకి భారీగా వరద ప్రవాహస్తోంది. రాబోయే రెండుగంటల్లో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.

బుధవారం ఢిల్లీలో 24 గంటల్లో 112.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చాణక్యపురిలోని డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్, కన్నాట్ ప్లేస్, ఐటీఓ, జనపథ్, రింగ్ రోడ్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో సెప్టెంబర్ 16, 1963న 172.6 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. బుధవారం నగరంలో కేవలం మూడు గంటల్లో 75.6 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డింది. భారీ వానకు నగరవ్యాప్తంగా 27 చెట్లు నేలకొరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

Full View


Tags:    

Similar News