Eknath Shinde: సీఎం ఉద్ధవ్ థాక్రేకు రెబల్ నేత ఏక్‌నాథ్ బహిరంగ లేఖ
Eknath Shinde: ఇది శాసన సభ్యుల ఆవేదన.. వినండి అంటూ లేఖలో పేర్కొన్న షిండే
Eknath Shinde: సీఎం ఉద్ధవ్ థాక్రేకు రెబల్ నేత ఏక్‌నాథ్ బహిరంగ లేఖ
Eknath Shinde: సీఎం ఉద్ధవ్ థాక్రేకు రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే బహిరంగ లేఖ రాశారు. నిన్న థాక్రే చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పలు అంశాలను షిండే ఈ లేఖలో ప్రస్తావించారు. గత రెండున్నరేళ్లుగా ఎమ్మెల్యేలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని.. రాజ్యసభ ఎంపీలను చుట్టూ ఉంచుకొని రాజకీయం నడిపారని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా సీఎం అధికారిక నివాసం తలుపులు మూసుకుపోయాయని సీఎంను కలిసేందుకు వెళితే గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చేదని చెప్పారు. ఇది శాసనసభ్యుల ఆవేదన.. వినండి అంటూ లేఖలో పేర్కొన్నారు. తాము ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందో ఏక్‌నాథ్ షిండే వివరించారు.