Reasons behind stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు అసలు కారణాలు... ఒకేసారి వేల మంది...

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఎలా New Delhi Railway Station stampede tragedy: జరిగింది? ఏ తప్పిదం ఈ తొక్కిసలాటకు కారణమైంది?

Update: 2025-02-16 06:42 GMT

Reasons behind stampede at New Delhi Railway Station: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు అసలు కారణాలు

Stampede at New Delhi Railway Station: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి 9:55 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో డజెన్ మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఎలా జరిగింది? ఏ తప్పిదం ఈ తొక్కిసలాటకు కారణమైంది?

శనివారం వీకెండ్. తెల్లవారితే ఆదివారం కావడంతో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లేందుకు వేల సంఖ్యలో జనం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రాత్రి 10:10 గంటలకు ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు రావాల్సి ఉంది. వీరంతా 13వ నెంబర్, 14వ నెంబర్ ప్లాట్‌ఫామ్స్ వద్ద రైళ్ల రాక కోసం వేచిచూస్తున్నారు.

అప్పటికే అదే రెండు ప్లాట్‌ఫామ్స్ వద్ద మరో రెండు రైళ్ల కోసం జనం వెయిట్ చేస్తున్నారు. అందులో ఒకటి బీహార్‌లోని జయ నగర్ వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్. మరొకటి ఒడిషా రాజధాని భువనేశ్వర్ వెళ్లాల్సిన భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్. ఈ రెండు రైళ్ల రాక ఆలస్యం కావడంతో అవి ఎక్కాల్సిన ప్రయాణికులు కూడా వాటి కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇలా ఓవైపు ఆ రెండు రైళ్లు ఎక్కాల్సిన ప్రయాణికులు, మరోవైపు ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లాల్సిన ప్రయాణికులు కలిపి వేల సంఖ్యలో జనంతో రెండు ప్లాట్‌ఫామ్స్ కిటకిటలాడాయి. అప్పటికే కౌంటర్లో 1500 మందికి జనరల్ టికెట్స్ ఇచ్చేశారు. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ వచ్చేందుకు మరో 15 నిమిషాల సమయమే మిగిలి ఉండటంతో ప్రయాణికులంతా 14వ నెంబర్ ప్లాట్ ఫామ్ వైపు పరుగులు తీశారు. జనం తొక్కిసలాటకు ఇది ఒక కారణమైంది.

ఇదేకాకుండా ప్రత్యక్షసాక్షులు చెబుతున్న కథనం ప్రకారం ప్రయాగ్ రాజ్ వెళ్లే రైలు మరో ప్లాట్ ఫామ్ మీదకు వస్తోందంటూ కొంతమంది చివరి నిమిషంలో అరవడం మొదలుపెట్టారు. దీంతో ప్రయాణికులు అది నిజమనుకుని ప్లాట్ ఫామ్ మారడం కోసం మెట్లవైపు పరుగులు తీశారు. ఈ రెండు కారణాలు తొక్కిసలాటకు కారణమయ్యాయి.

తొక్కిసలాట తరువాత న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కనిపించిన దృశ్యాలు

అయితే రైల్వే అధికారులు మాత్రం రైలు ప్లాట్ ఫామ్ మారిందన్నది కేవలం వదంతులు మాత్రమేనని, అందులో నిజం లేదని అన్నారు. ఒకవేళ స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్, భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ సమయానికి వచ్చి ఉంటే ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ వచ్చే సమయానికి ఇంత రద్దీ ఉండేది కాదేమోననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

WATCH THIS VIDEO - Ranveer Allahbadia Row: రణ్‌వీర్ అలహాబాదియాకు సుప్రీం కోర్టు లాయర్ ఎవరో తెలుసా ? | hm డిజిటల్

Full View


Tags:    

Similar News