Ratha Saptami 2026: ఒకే రోజు ఏడు వాహనాలపై గోవిందరాజస్వామి దర్శనం.. పూర్తి షెడ్యూల్ ఇదే!

జనవరి 25న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఒకే రోజు ఏడు వాహనాలపై స్వామివారు ఇచ్చే దర్శనాన్ని 'అర్థ బ్రహ్మోత్సవం'గా పిలుస్తారు. ఆ రోజు వాహన సేవల పూర్తి సమయాలు మరియు తిరుమల రద్దీ వివరాలు ఇక్కడ చూడండి.

Update: 2026-01-13 03:44 GMT

తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో సర్వదర్శనానికి సమయం పెరుగుతోంది. మరోవైపు, తిరుపతిలోని చారిత్రాత్మక శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది. జనవరి 25న జరగనున్న ఈ వేడుకను భక్తులు ‘అర్థ బ్రహ్మోత్సవం’ లేదా 'ఒకరోజు బ్రహ్మోత్సవం'గా పిలుచుకుంటారు.

తిరుమల లేటెస్ట్ అప్‌డేట్స్ (జనవరి 12 గణాంకాలు):

శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం నాటి వివరాలు ఇలా ఉన్నాయి:

దర్శించుకున్న భక్తులు: 76,447 మంది.

తలనీలాలు సమర్పించిన వారు: 21,708 మంది.

హుండీ ఆదాయం: రూ. 3.42 కోట్లు.

దర్శన సమయం: టోకెన్ లేని భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతోంది.

జనవరి 25: రథసప్తమి వాహన సేవల షెడ్యూల్

రథసప్తమి రోజున శ్రీ గోవిందరాజస్వామి వారు దేవేరులతో కలిసి ఏడు వేర్వేరు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ వేడుకల వివరాలు:

 అర్థ బ్రహ్మోత్సవం అని ఎందుకు అంటారు?

సాధారణంగా బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. కానీ రథసప్తమి నాడు సూర్యోదయం నుండి రాత్రి వరకు బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ముఖ్యమైన వాహన సేవలన్నీ ఒకే రోజు నిర్వహిస్తారు. అందుకే దీనిని ‘అర్థ బ్రహ్మోత్సవం’ అని పిలుస్తారు. ఈ వేడుకను చూడటం భక్తులు మహా భాగ్యంగా భావిస్తారు.

Tags:    

Similar News