Rakesh Tikait: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు
Rakesh Tikait: అన్నదాతలకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయలేదు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు
Rakesh Tikait: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ దళ్, సమాజ్ వాదీ పార్టీ కూటమికి మద్దతు ఇవ్వాలని బీకేయూ చీఫ్ నరేశ్ టికాయత్ విజ్ఞప్తి చేశారని.. అయితే సిసౌలిలో బీజేపి నేత సంజీవ్ బిల్యాన్ తో నరేశ్ టికాయత్ సమావేశమైన కొన్ని గంటల తర్వాత తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి రైతులు 13 నెలల పాటు ఆందోళన చేసి విజయం సాధించారు అయినా రాజకీయ పార్టీలు వాటి గురించి ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.