Coronavirus: రాజ్యసభ ఎన్నికలు వాయిదా..

రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2020-03-24 07:14 GMT

రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది.

అయితే తదుపరి షెడ్యూల్ ఎప్పుడన్నది మాత్రం ఈసీ స్పష్టం చేయలేదు..ఇక పది రాష్ట్రాల్లో 37 సీట్లు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగతా 18 సీట్లకు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదిలా ఉంటే సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం లాక్ డౌన్ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పై కఠిన చర్యలు తీసుకొని ఉండడంతో ప్రజలు రోడ్ల మీదికి రావడానికి ఆలోచిస్తున్నారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరుణ కేసులో పదహారు వెలకి చేరుకున్నాయి. భారత్లో 490 కి పైగా కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది మరణించారు

Tags:    

Similar News