Rajya Sabha: లతా మంగేష్కర్‌కు రాజ్యసభ నివాళి
Rajya Sabha: లతామంగేష్కర్ సంతాప సూచికగా రాజ్యసభ గంటపాటు వాయిదా
లతా మంగేష్కర్‌కు రాజ్యసభ నివాళి
Rajya Sabha: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతికి రాజ్యసభ ఘన నివాళి అర్పించింది. క్వశ్చన్ అవర్‌ను రద్దు చేశారు. అనంతరం సభను గంట సేపు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు లతా మంగేష్కర్‌ను స్మరించుకుంటూ సందేశం చదివారు.
లతాజీ మరణంతో ఈ దేశం ఓ గొప్ప గాయని, దయామూర్తిని, మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోయిందన్నారు. లతా మరణం ఓ శకానికి ముగింపు. సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ఆ తర్వాత సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు.