Rajasthan political Crisis Updates: 'స్పీకప్ ఫర్ డెమోక్రసీ' ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్

Update: 2020-07-26 07:34 GMT

Rajasthan political Crisis Updates: రాజస్థాన్ లో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీని నిర్వహించాలని కాంగ్రెస్ పట్టుబడుతుంటే.. ఈ పరిస్థితులలో అసెంబ్లీని నిర్వహించడం సాధ్యపడదని గవర్నర్ కలరాజ్ మిశ్రా చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో స్పీకప్ ఫర్ డెమోక్రసీ ప్రచారాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్బంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఐక్య స్వరానికి పిలుపునించింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక వీడియోను ట్వీట్ చేశారు. అందులో బిజెపి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని. మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ ఇదే పనిలో చేసిందని అన్నారు. రాజస్థాన్ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి స్పీక్ అప్ ఫర్ డెమోక్రసీ ప్రచారంలో పాల్గొనాలని రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గోవింద్ సింగ్ దోత్సారా విజ్ఞప్తి చేశారు. ఇక నిన్న హోటల్ ఫెయిర్‌మాంట్‌లో ఉదయం యోగా అనంతరం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఆ తరువాత రాత్రి 11:30 గంటలకు గెహ్లాట్ తన ఇక్కడికి చేరుకున్నారు. అప్పటివరకూ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇదిలావుండగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సతీష్ పూనియా మరోసారి ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారు. అశోక్ గెహ్లాట్ అత్యాశకు పోయి కుర్చీని కూల్చుకుంటున్నాడని అన్నారు.  

Tags:    

Similar News