Rajasthan Political Crisis: సచిన్ పైలట్ వర్గానికి ఇవాళే స్పీకర్ షాక్ ఇస్తారా?

Update: 2020-07-17 06:00 GMT
sachin Pilot (file photo)

Rajasthan Political Crisis: సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు డివిజనల్ బెంచ్ శుక్రవారం విచారించనుంది. అయితే అసెంబ్లీ స్పీకర్ నోటీసును ఎమ్మెల్యేలు సవాలు చేశారు. ఈ పిటిషన్లపై మధ్యాహ్నం 1 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. అదే సమయంలో, ఎమ్మెల్యేలు తమ జవాబును అసెంబ్లీలో సమర్పించడానికి మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఉంది.

ఒకవేళ శాసనసభ్యులను స్పీకర్ కు సంజాయిషీ ఇవ్వని పక్షంలో వారిని అనర్హులుగా ప్రకటించవచ్చని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే మొదటిసారి తిరుగుబాటు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వకుంటే మరోసారి నోటీసులు జారీ చేయవచ్చని.. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవచ్చని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలావుంటే రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన మూడు ఆడియో సంబంధిత సంభాషణలు గురువారం వైరల్ అయ్యాయి. ఈ ఆడియోలో ఒక వ్యక్తి సంజయ్ జైన్ అని, మరొకరు గజేంద్ర సింగ్ అని వర్ణించుకోవడం బయటకు వచ్చింది. కాగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు సచిన్ పైలట్, రమేష్ మీనా, ఇంద్రాజ్ గుర్జర్, గజరాజ్ ఖటన, రాకేశ్ పరీక్, మురారీ మీనా, పిఆర్ మీనా, సురేష్ మోడీ, భన్వర్ లాల్ శర్మ, వేద్ప్రకాష్ సోలంకి, ముఖేష్ భాకర్, రామ్నివాస్ గవాడియా, హరీష్ మీనా, చరిదేహ్రామరా, సింగ్, దీపేంద్ర సింగ్ మరియు గజేంద్ర శక్తివత్ గా ఉన్నారు. 

Tags:    

Similar News