Rajasthan Exit Poll 2023: రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్.. ఈసారి అధికారం ఎవరిదంటే?
Rajasthan Exit Poll 2023: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే.
Rajasthan Exit Poll 2023: రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్.. ఈసారి అధికారం ఎవరిదంటే?
Rajasthan Exit Poll 2023: రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అధికార మార్పిడి సంప్రదాయం మరోసారి కొనసాగే అవకాశముంది. మెజారిటీ సర్వే సంస్థలు బీజేపీ అధికారంలోకి రానుందని అంచనా వేశాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీ.. అధికార పీఠాన్ని వశం చేసుకుంటుందని తెలిపాయి. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అంటే అధికారంలోకి రావాలంటే... 100కు పైన సీట్లు రావాల్సి ఉంది.
ఇవాళ వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ ఎడ్జ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీకి 100 నుంచి 122, కాంగ్రెస్‌కు 62 నుంచి 85సీట్లు రానున్నట్టు జన్‌కీబాత్ సంస్థ నివేదిక ఇచ్చింది. అలాగే టైమ్స్ నౌ..బీజేపీకి 108 నుంచి 128, కాంగ్రెస్ 56 నుంచి 72సీట్లలో గెలువనున్నట్టు పేర్కొంది. పీపుల్స్ పల్స్ బీజేపీకి 95 నుంచి 115, కాంగ్రెస్‌కు 73 నుంచి 95వరకు రానున్నట్టు తెలిపింది. ఇండియా టూడే మాత్రం..కాంగ్రెస్ కే మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. రాజస్థాన్ కాంగ్రెస్‌లో అశోక్ గెహ్లట్, సచిన్ఫైలట్ మధ్య జగడం..పార్టీకి నష్టం చేసిందని, అందుకే జనం బీజేపీ వైపు చూడబోతున్నారనే అంచనాలు వెలువడ్డాయి.
రాజస్థాన్ (199): ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
జన్ కీ బాత్: బీజేపీ 100-122, కాంగ్రెస్ 62-85, ఇతరులు 14-15
భారత్ వర్ష్: బీజేపీ 100-110, కాంగ్రెస్ 90-100, ఇతరులు 05-15
పీపుల్ పల్స్ బీజేపీ 95- 115 కాంగ్రెస్ 73-95 ఇతరులు 8-21