Railways: ప్లాట్ ఫామ్ టికెట‌్ ధర పెంపు

Railways: ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్ట్యా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.

Update: 2021-03-06 01:52 GMT

ఇమేజ్ సోర్స్: ఇండియన్ రైల్వేస్


Railways: కరోనాతో విధించిన లాక్ డౌన్ తో పూర్తిగా రెగ్యులర్ రైళ్లు నడవడం లేదు. స్పెషల్ ట్రైన్స్ పేరుతో కొద్ది పాటి రైళ్ళను మాత్రమే నడుపుతున్నదక్షిణ మధ్య రైల్వేశాఖ దేశంలోని కొన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను పెంచి ప్రయాణీకులపై మరో భారం మోపింది. సాధారణంగా రూ.10 ఉన్న ప్లాట్‌ఫాం టికెట్‌ను శనివారం నుంచి విజయవాడ రైల్వే స్టేషన్లో ఇకపై తాత్కాలికంగా రూ.30కి పెంచుతూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి స్టేషన్లలో పోస్టర్లు అతికించి ప్లాట్‌ఫామ్‌ వినియోగదారుల నుంచి ఈ మొత్తాన్ని వసూలుచేస్తున్నారు. రైల్వేశాఖ ఈ చర్యను సమర్థించుకొంది. ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యధిక జనసమ్మర్దం ఉన్న స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి తాత్కాలిక ప్రాతిపదికన ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనావేసి స్టేషన్లకు వచ్చే వారి సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో సమయానుకూలంగా ఈ నిర్ణయాన్ని తాత్కాలిక ప్రాతిపదికన అమలుచేస్తున్నట్లు తెలిపింది. ఈ విధానాన్ని ఇంతకుముందు నుంచే అప్పుడప్పుడూ అమలుచేస్తున్నామని, ఇందులో కొత్తేమీ లేదని పేర్కొంది.

స్పెషల్‌ రైళ్లన్నింటికీ ఇది వర్తిస్తుంది. విజయవాడతో పాటు డివిజన్‌ పరిధిలోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్‌, భీమవరం స్టేషన్లలో కూడా రూ.30 చెల్లించాల్సిందే. అసలే కరోనాతో ఆర్థిక వ్యవస్థ అతలా కుతలం అవడంతో చాలా మంది జీవనోపాధి కోల్పోయి నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వారంతా పెంచిన రేట్లతో ఎలా బతకాలో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News