Indian Railway: రైళ్లు ఆపే ఉద్దేశం లేదు.. రైల్వే బోర్డు
Indian Railway: రద్దీ మార్గాల్లోనే సర్వీసులు పెంచుతాం: సునీల్ శర్మ * కొవిడ్ నెగెటివ్ రిపోర్టు అవసరం లేదు: సునీల్ శర్మ
ఇండియన్ రైల్వే (ఫైల్ ఇమేజ్)
Indian Railway: దేశంలో కరోనా అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. దాంతో రైళ్లు ఆపే ఉద్దేశం లేదని రైల్వేబోర్డు చైర్మన్ సునీత్ శర్మ స్పష్టం చేశారు. దేశంలో అన్ని గమ్యస్థానాలకూ తగిన సంఖ్యలో సర్వీసులను నడపడానికి అనువుగా రైళ్లను సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. ఎక్కడా కొరత లేదన్నారు. డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనంగా రైళ్లు నడపడానికి డివిజన్ రైల్వే మేనేజర్లకు అధికారాలు ఇచ్చినట్టు వెల్లడించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి నెగిటివ్ రిపోర్ట్ అవసరం లేదని రాబోయే రోజుల్లో ఆలోచిస్తామన్నారు.