అమేథీ ప్ర‌జ‌ల‌కు రాహుల్ సాయం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేథీ ప్ర‌జ‌ల‌కు ఆహార ధాన్యాలు, నిత్యావసరాలను పంపినట్లు కాంగ్రెస్ జిల్లా యూనిట్ తెలిపింది.

Update: 2020-04-17 14:15 GMT
Rahul Gandhi

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేథీ ప్ర‌జ‌ల‌కు ఆహార ధాన్యాలు, నిత్యావసరాలను పంపినట్లు కాంగ్రెస్ జిల్లా యూనిట్ తెలిపింది. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న 5 ట్రక్కుల బియ్యం, గోధుమలు, ఒక ట్రక్కు పప్పులు, వంట నూనెలు అందించిన‌ట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో అమేథీ నియోజకవర్గ ప్రజలు 16,400 నిత్యావసరాల కిట్లను నియోజకవర్గంలోని 877 పంచాయితీల్లోని ప్రజలకు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ కార్యాల‌యం తెలిపింది. అలాగే కరోనా నియంత్రణలో భాగంగా పనిచేస్తున్న సిబ్బందికి 50,000 మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు అందించినట్లు తెలిపారు.

రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఫైట్స్‌ కరోనా పేరుతో ఒక గ్రూపు ప్రజల సమస్యలు తీర్చేందుకు పనిచేస్తుందని తెలిపారు. గురువారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ తాత్కాలిక ఉపశమనమేన్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టులు నిర్వ‌హించాల‌ని ఎక్కడ వ్యాపిస్తుందనేది కనిపెట్టవచ్చని అన్నారు. కరోనాకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర‌ల కృషి అభినంద‌నీయం అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో 20 రోజుల్లో 200 పడకల ఆస్పత్రి నిర్మించడం కరోనా నియంత్రణకు ఆ రాష్ట్ర కృషి ఎన‌లేద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి క‌రోనా నియంత్ర‌ణ‌కు శ్ర‌మిస్తున్నాయ‌ని. కేంద్రం ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని రాహుల్ గాంధీ ట్విటర్‌లో కోరారు 

Tags:    

Similar News