Rahul Gandhi: రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ
Rahul Gandhi: సభ్యత్వం పునరుద్ధరిస్తూ స్పీకర్ కార్యాలయం నోటిఫికేషన్
Rahul Gandhi: రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది లోక్‌సభ. గుజరాత్ హైకోర్టు విధించిన శిక్షపై.. సుప్రీంకోర్టు స్టే విధించడంతో స్పీకర్ రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. అయితే రాహుల్ న్యాయపోరాటంతో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. శిక్ష అమలుపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో రాహుల్ గాంధీ సభ్యత్వ పునరుద్ధరణకు లైన్ క్లియర్ అవగా స్పీకర్ కార్యాలయం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది.