Rahul Gandhi: రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ..!

Rahul Gandhi: స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై ఉత్కంఠ

Update: 2023-08-07 03:31 GMT

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ..!

Rahul Gandhi: పరువు నష్టం కేసుతో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి.. తిరిగి సభ్యత్వం దక్కుతుందా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది. స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. అయితే రాహుల్ న్యాయపోరాటంతో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. శిక్ష అమలుపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో రాహుల్ గాంధీ సభ్యత్వ పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయింది. అయితే సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారా..? మరింత సమయం తీసుకుంటారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

గతంలో లక్షద్వీప్ ఎంపీ ఫైజల్‌ విషయంలో సభ్యత్వ పునరుద్ధరణకు ఆలస్యం జరిగింది. కేరళ హైకోర్టు ఫైజల్‌కు విధించిన శిక్షపై స్టే విధించినా లోక్‌సభ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణకు కొద్ది గంటల ముందు సభ్యత్వం పునరుద్ధరిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదలైంది. రాహుల్ విష‍యంలో కూడా జాప్యం చేస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉభయసభల ప్రారంభానికి ముందే లోక్‌సభ స్పీకర్ రాహుల్ సభ్యత్వ పునరుద్ధరణపై నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Tags:    

Similar News