Rahul Gandhi: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్‌కు ఈసీ నోటీసులు
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ నోటీసులు పంపింది. నిన్న రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీని పనౌతి అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్‌కు ఈసీ నోటీసులు
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ నోటీసులు పంపింది. నిన్న రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీని పనౌతి అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని వెళ్లడం వల్లే భారత్ వరల్డ్‌కప్ ఓడిపోయిందని కామెంట్స్ చేశారు. దీంతో బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై వివరణ కోరిన ఎన్నికల కమిషన్... ఈనెల 25న సాయంత్రం 6 గంటలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సమాధానం ఇవ్వకపోతే సంబంధిత చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు.. ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలపాలని రాహుల్‌ను కోరింది ఈసీ.