TOP 6 News @ 6 PM: రాజ్ తరుణ్, లావణ్య కేసులో కొత్త ట్విస్ట్... మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో వీడియోలు చూసి పోలీసులే షాక్!!

Update: 2025-02-03 12:44 GMT

1) రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్ సాయి అరెస్ట్.. హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు?

Mastan Sai arrested in Lavanya, Raj Tarun case: రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ తో తను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణం అంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మస్తాన్ సాయి అమ్మాయిలు, మహిళల వీడియోలు రికార్డ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తను కూడా మస్తాన్ సాయి బాధితురాలినే అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అందుకు సాక్ష్యంగా మస్తాన్ రికార్డ్ చేసినట్లుగా చెబుతున్న కొన్ని వీడియోలను లావణ్య పోలీసులకు అందించారని తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) రంగారెడ్డి కలెక్టరేట్‌కు మోహన్ బాబు, మంచు మనోజ్

మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల తగాదా మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి మంచు మోహన్ బాబు, మనోజ్ కుటుంబాలు రంగారెడ్డి కలెక్టరేట్ కు వచ్చారు. తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిని మంచు మనోజ్ ఆక్రమించుకున్నారని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తను సంపాదించిన ఆస్తిపై తనకు మాత్రమే హక్కులు ఉంటాయని మోహన్ బాబు తన పిటిషన్ లో పేర్కొన్నారు.

తాను సీనియర్ సిటిజెన్ అయినందున, తన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాల్సిందిగా మోహన్ బాబు కలెక్టర్‌ను కోరుకుంటున్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు వినేందుకు కలెక్టర్ ఇవాళ వారిని కలెక్టరేట్‌‌కు పిలిపించినట్లు తెలుస్తోంది. 

3) KP Chowdary: గోవాలో టాలీవుడ్ నిర్మాత కేపి చౌదరి సూసైడ్... కారణం అదేనా?

Tollywood Producer KP Chowdary's suicide case: టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి ఇక లేరు. గోవాలోని తన నివాసంలో ఆయన మృతి చెందారు. తెలుగు సినీ పరిశ్రమలో అందరూ ఆయన్ను సింపుల్‌గా కేపి చౌదరిగా పిలుస్తుంటారు. కేపీ చౌదరి మృతిపై విచారణ చేపట్టిన గోవా పోలీసులు... ఇది ఆత్మహత్య అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉంది.

ఖమ్మం జిల్లాకు చెందిన కేపి చౌదరి కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. పవన్ కల్యాణ్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ మూవీకి ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం లాంటి చిత్రాలను కూడా కేపీ చౌదరినే డిస్ట్రిబ్యూట్ చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) ప్రధాని మోదీ ఆలోచన గొప్పదే కానీ... యూపీఏ ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టిన రాహుల్ గాంధీ

Rahul Gandhi aout make in india: ప్రధానీ మోదీ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా గొప్ప ఐడియా అని కితాబిచ్చారు. కానీ ఆ ఐడియాను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 2014 నుండి ఇప్పటివరకు నమోదైన స్థూల జాతీయ ఆదాయంలో తయారీ రంగం వాటా చూస్తే ఆ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు.

ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాలు రెండు కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాయని రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం లోక్ సభలో మోదీ సర్కారుపై పలు ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) RBI: సామాన్యుడికి భారీ బహుమతి.. త్వరలో తగ్గనున్న ఈఎంఐ భారం ?

RBI: కేంద్ర బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కలిగిస్తూ 12 లక్షల రూపాయల ఆదాయాన్ని పన్ను మినహాయింపు పరిధిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పన్ను ఊరట తర్వాత అందరి దృష్టి ఫిబ్రవరి 7న జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ సమావేశంపై నిలిచింది. ఈ సమావేశంలో RBI రెపో రేటును తగ్గిస్తుందా? తద్వారా మధ్య తరగతి ప్రజలకు EMI భారం తగ్గే అవకాశం ఉందా? అన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) U19 T20 WC: టీమిండియాకు బీసీసీఐ బంపర్ ప్రైజ్.. కలలో కూడా ఊహించి ఉండరు

U19 T20 WC: భారత అండర్-19 మహిళా జట్టు 2025 T20 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఈ ఘనత భారత క్రికెట్‌కు మరో మైలురాయిగా నిలిచింది. కేవలం 7 నెలల క్రితమే రోహిత్ శర్మ నేతృత్వంలోని పురుషుల జట్టు 2024 T20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది.

ఈ విజయాన్ని పురస్కరించుకొని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అండర్-19 టీమ్‌కి భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో ఓటమి అనే మాటే లేకుండా, ప్రతీ మ్యాచ్‌లో గెలిచింది. ఈ గెలుపును పురస్కరించుకొని బీసీసీఐ మొత్తం రూ.5 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News