Rahul Gandhi: ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ బర్త్ డే
Rahul Gandhi: రాహుల్ గాంధీతో కేక్ కోయించిన ఖర్గే, కేసీ
Rahul Gandhi:ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ బర్త్ డే
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. రాహుల్ నిబద్ధత, నిజాయితీ, ప్రజలకు మేలు చేయాలన్న తపన ఎంతో మెచ్చుకోదగ్గదని ఖర్గే ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. బాధలో ఉన్నవారి కన్నీరు తుడవడానికి ముందుటారని తెలిపారు. దేశ ప్రజల పట్ల మీకున్న అంకితభావం ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.