పోలీసులు నన్ను తోసేసి లాఠీఛార్జ్ చేశారు : రాహుల్ గాంధీ

Update: 2020-10-01 10:11 GMT

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్ సామూహిక అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని సందర్శించే సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ట్విట్టర్ వేదికగా నిరసనలు వ్యక్తం చేశారు ఆ పార్టీ కార్యకర్తలు. రాహుల్ అరెస్టుపై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ను చూసి సీఎం యోగి ఆదిత్యనాథ్ భయపడుతున్నారా అని ప్రశ్నించారు.

రహదారిపై కవాతు చేస్తుండగా తమను నేలమీదకు తోసేసి, లాఠీ ఛార్జ్ చేశారని రాహుల్ ఆరోపించారు. కాగా మంగళవారం మరణించిన సామూహిక అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి రాహుల్ ఇక్కడకు వచ్చారు. అయితే హత్రాస్ కు వెళ్లే మార్గంలో వారి కాన్వాయ్ ఆగిపోయింది.. దాంతో పాదయాత్రగా నడుచుకుంటూ బయలుదేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకొని నినాదాలు చేసుకుంటూ రోడ్డుమీద నడవడంతో పోలీసులు రాహుల్ బృందాన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయని.. గుమిగూడటం ప్రమాదకరమని అందువల్లే వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 

Tags:    

Similar News