పంజాబ్‌లో కొలువుదీరనున్న కేబినెట్.. మంత్రుల జాబితాను ప్రకటించిన మాన్
Punjab New Cabinet: *ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రులుగా ప్రమాణం *12.30 గంటలకు తొలి కేబినెట్ సమావేశం
పంజాబ్‌లో కొలువుదీరనున్న కేబినెట్.. మంత్రుల జాబితాను ప్రకటించిన మాన్
Punjab New Cabinet: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఆ రాష్ట్రంలో పాలనా పగ్గాలను చేపట్టింది. మూడు రోజుల క్రితం ఆప్ నేత భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక ఇవాళ 10 మంది సభ్యులతో తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.
వారి వివరాలను కూడా భగవంత్ మాన్ వెల్లడించారు. మాన్ కేబినెట్‌లో ఆయనతో కలిపి మొత్తం 11 మంది ఉండగా.. వారిలో ఒక్క మహిళకు మాత్రమే అవకాశం కల్పించారు. కొత్త మంత్రులు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మాన్ తన తొలి కేబినెట్ భేటీని నిర్వహించనున్నారు.