PSLV: నేటి నుంచి పీఎస్ఎల్వీ కౌంట్ డౌన్ షురూ

Update: 2025-05-17 01:06 GMT

PSLV: నేటి నుంచి పీఎస్ఎల్వీ కౌంట్ డౌన్ షురూ

PSLV: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సి61 ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నవారు.పీఎస్ఎల్వీ ఈఓస్ 09 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించి రాకెట్ సన్నద్ధత సమీక్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సాగింది. జనవరిలో రోదసిలోకి పంపిన ఎన్వీఎస్ 02 ఉపగ్రహం సాంకేతిక సమస్యలు ఏర్పడి నిర్ణీత కక్ష్యలోకి వెళ్లేదు. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని పీఎస్ఎల్వీ సి61 ప్రయోగంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. తర్వాత లాంచ్ ఆథరైజేషన్ సమావేశం షార్ సంచాలకులు రాజరాజన్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్బంగా ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. 22 గంటల కౌంట్ డౌన్ నిర్వహించాలని నిర్ణయించారు. శనివారం ఉదయం 7.59గంటలకు పీఎస్ఎల్వీ సి61 నింగిలోకి దూసుకెళ్తుంది. గురువారం ఇస్రో చైర్మన్ నారాయణన్ షార్ కు చేరుకుని శాస్త్రవేత్తలకు కొన్ని సూచనలు చేశారు. శుక్రవారం తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు వెళ్లి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం షార్ కు చేరుకుని రాకెట్ సన్నద్ధతపై సమీక్షించారు.

Tags:    

Similar News