ISRO: నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగం విజయవంతం..
ISRO: సెప్టెంబర్‌లో మరో PSLV ప్రయోగం చేపడతాం- సోమనాథ్
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగం విజయవంతం..
ISRO: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV - C 56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు రోదసిలోకి పంపారు. డీఎస్ - షార్ ఉపగ్రహం ఇందులో ప్రధానమైనది. దీంతో పాటు వెలాక్స్ AM, ARCADE, SCOOT - టూ, నులియన్, గెలాసియా - టూ, ORB - ట్వెల్వ్ ఉపగ్రహాలను ఈ రాకెట్ మోసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.