ప్రియాంకకు యూపీ లోపూర్తి స్థాయి బాధ్యతలు

Update: 2019-09-03 10:55 GMT

మొన్నటి ఎన్నికల్లో యూపీలో తన శక్తి మేరకు ప్రచారం చేసిన ప్రియాంకా గాంధీ సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. తూర్పు యూపీ విభాగపు ఇన్చార్జ్ గా ఉన్న ప్రియాంకను త్వరలోనే యూపీ మొత్తానికి పూర్తిస్థాయి ఇన్చార్జ్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ప్రజలను కలసుకోవడంలోనూ, వారికి చేరువవడంలోనూ, బీజేపీని విమర్శించడంలోనూ ప్రియాంక చాలా చురుకుగా, నాయకత్వ పాత్రను పోషించారు. ఎన్నికల్లో అనుకున్నఫలితాలు రాకపోయినా, ప్రియాంక మాత్రం సమర్ధవంతమైన నేతగా గుర్తింపు పొందారు. 

Tags:    

Similar News