Priyanka Gandhi: యోగి సర్కార్‌పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫైర్
Priyanka Gandhi: కాంట్రాక్ట్ ఉద్యోగినిపై ప్రభుత్వ అధికారి వేధింపులు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై మండిపడ్డ ప్రియాంక గాంధీ (ఫైల్ ఇమేజ్)
Priyanka Gandhi: యూపీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వార్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా.. లక్నోలోని బాపూ భవన్‌లో ప్రభుత్వ అధికారి.. కాంట్రాక్ట్ ఉద్యోగిని వేధింపులకు గురిచేయడంపై ఫైర్ అయ్యారు. యూపీలో మహిళలకు భద్రత ఏమాత్రం లేదని ప్రియాంక ఆరోపించారు. సచివాలయం, రోడ్డు ఇలా ప్రతిచోటా యూపీ మహిళలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. మహిళల భద్రతపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ గొప్పగా చెబుతుంటే.. వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు.