PM Modi Speech on New Education Policy: నేడు ప్రధాని మోడీ ప్రసంగం.. నూతన విద్యా విధానంపై వివరణ

PM Modi Speech on New Education Policy: ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2020-08-07 03:30 GMT
Narendra Modi (File Photo)

PM Modi Speech on New Education Policy: ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని అన్ని రాష్ట్రాల్లో వీలైనంతవరకు అమలు చేయలని సూచించింది. దీనికే కేంద్ర కేబినేట్ ఆమోదం తెలుపగా, నేడు దేశ ప్రజలతో దీనిపై వరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సమయాత్తమవుతున్నారు.

నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) ప్రకారం ఉన్నత విద్యలో సంస్కరణలపై శుక్రవారం జరిగే సమావేశంలో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూజీసీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు, అందులో భాగస్వాములైన ఇతరులకు జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)పై అవగాహన కలిగించాలని యూజీసీ దేశంలోని విశ్వవిద్యాలయాలను, కళాశాలలను ఆదేశించింది. విశ్వవిద్యాలయాల కార్యకలాపాల పర్యవే క్షణకు సంబంధించి యూజీసీ నిర్వహించే పోర్టల్‌ను పరిశీలించాలని విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు సూచించింది.

నూతన విద్యా విధానంలో ముఖ్యమైన అంశాలు:

- 2035 కల్లా 50 శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. 2040 కల్లా అన్ని ఉన్నత విద్యా సంస్థలు విభిన్న కోర్సులను అందించే సంస్థలుగా మారి , ప్రతి విద్యా సంస్థలో 3000 అంత కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది.

- అయిదవ తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలు నేర్పిస్తారు. బోర్డు పరీక్షలు విద్యార్థి సముపార్జించిన జ్ఞానాన్ని పరీక్షించే విధంగా తీర్చి దిద్ది, మూస తరహా పరీక్షలకు స్వస్తి చెబుతారు. పిల్లల రిపోర్ట్ కార్డులలో కేవలం వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు మాత్రమే కాకుండా వారి ఇతర నైపుణ్యాలకు కూడా మార్కులు ఇస్తారు.

- విద్యా విధానాన్ని ఇప్పుడున్న 10 + 2 నుంచి 5+3+3+4 గా విభజిస్తారు. మొదటి అయిదు సంవత్సరాలలో ప్రీ ప్రైమరీ నుంచి రెండవ తరగతి వరకు ఉంటాయి. రెండవ దశలో మూడు నుంచి అయిదవ తరగతి, తర్వాత దశలో ఆరు నుంచి ఎనిమిదవ తరగతులు, చివరి నాలుగు సంవత్సరాలలో తొమ్మిది నుంచి 12 వ తరగతి వరకు ఉంటాయి.

- పిల్లలు తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. అన్ని కోర్సులను రెండు భాషలలో అందిస్తారు.

- అన్ని పాఠశాలల్లో సంస్కృత భాషను ముఖ్య భాషగా ప్రవేశ పెడతారు. సంస్కృత విద్యాలయాలు కూడా విభిన్న తరహా కోర్సులు అందించే విద్యా సంస్థలుగా రూపాంతరం చెందుతాయి.

- డిజిటల్ విద్య విధానాన్ని అభివృద్ధి చేసేందుకు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్ స్థాపన. ఎనిమిది ప్రాంతీయ భాషలలో ఇ-కోర్సులు. వర్చ్యువల్ ల్యాబ్స్‌ అభివృద్ధి.

- ఉన్నత విద్యనభ్యసించేందుకు మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను కల్పిస్తోంది. దీంతో ఎవరైనా మధ్యలో కోర్సు వదిలి వెళ్ళిపోతే, తిరిగి చేరినప్పుడు గతంలో వచ్చిన మార్కులను వాడుకునే అవకాశం

ఉంటుంది.

- ఉన్నత విద్యా సంస్థలు , ప్రొఫెషనల్ విద్యా సంస్థలను విభిన్న తరహా కోర్సులు అందించే విధంగా తీర్చి దిద్దుతారు.

- దేశంలో 45000 అఫిలియేటెడ్ కాలేజీలు ఉన్నాయి. కాలేజీలకు ఉన్న అక్రెడిటేషన్ ఆధారంగా గ్రేడెడ్ అటానమీలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్సియల్ అటానమీ ఇస్తారు.

- నూతన విద్యా విధానం ద్వారా ప్రపంచంలో ఉన్న టాప్ 100 విదేశీ విశ్వ విద్యాలయాల కేంద్రాలు భారతదేశంలో నిర్వహించేందుకు ఒక కొత్త చట్టం ద్వారా అనుమతులు ఇస్తారు.

- ఐ ఐ టి లలో, ఇంజనీరింగ్ విద్యా సంస్థలలో ఆర్ట్స్ హ్యుమానిటీస్ కోర్సులు, హ్యుమానిటీస్ విద్యార్థులు సైన్స్, ఇతర వృత్తి విద్యలు నేర్చుకునే విధంగా కోర్సులను ప్రవేశ పెడతారు.

- అన్ని కాలేజీలలో, ఉన్నత విద్యా సంస్థలలో లిటరేచర్, సంగీతం, తత్వ శాస్త్రం, ఆర్ట్, డాన్స్, థియేటర్, గణితం, ప్యూర్ అప్లైడ్ సైన్సెస్, సోషియాలజీ, స్పోర్ట్స్, ట్రాన్సలేషన్ విభాగాలు ఉండేటట్లు చూస్తారు.

- అన్ని కాలేజీలకు ఒకే ఒక్క కామన్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష నిర్వహించడం తప్పని సరి కాదు.

- ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు పరిమితికి మించి ఏ ఉన్నత విద్యా సంస్థ ఎక్కువ వసూలు చేసేందుకు వీలు లేదు.

- స్థూల జాతీయ ఉత్పత్తిలో 6 శాతం విద్యా రంగానికి కేటాయిస్తారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీడీపీలో 4.43 శాతం విద్యా రంగానికి కేటాయిస్తున్నారు.

ఆన్ లైన్ లో విద్యను అందించేందుకు ప్రభుత్వం నేషనల్ టెక్నాలజీ ఫోరమ్ ఏర్పాటు చేస్తుంది. 

Tags:    

Similar News