Narendra Modi Letter to MS Dhoni: ఎంఎస్ ధోనీకి లేఖ రాసిన ప్రధాని..

Narendra Modi Letter to MS Dhoni: అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీకి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు.

Update: 2020-08-20 10:00 GMT
Narendra Modi Letter to MS Dhoni

Narendra Modi Letter to MS Dhoni: అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీకి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. 'ధోనీ రిటైర్మెంట్ పై గురించి దేశమంతా చేర్చించుకుంటుంది. 130 కోట్ల మంది భారతీయులు ధోనీ రిటైర్మెంట్ పట్ల నిరాశ చెందారు. భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. క్రికెట్ లో ఉత్తమ కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా, ధోనీ పేరు భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలి'. అని మోడీ తన లేఖలో పేర్కొన్నారు.



ఇక కొద్దికాలంగా ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ అవుతారనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు ఆ వార్తలకు చెక్ పడుతూనే వస్తోంది. అయితే, ఇప్పుడు ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.. అంతే కాదు, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే భారత్‌లోనూ ఓ పవర్ హిట్టర్‌ ఉన్నాడని క్రికెట్ ప్రపంచానికి తెలియజెప్పిన ధోనీ.. కెప్టెన్‌గానూ 2007‌లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా చేజార్చుకున్న ఈ మాజీ కెప్టెన్ ప్రస్తుతం చెన్నైలో ఐపీఎల్ 2020 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. రాంచీ నుంచి ఛార్టర్డ్ ప్లైట్‌లో శుక్రవారం అక్కడికి వెళ్లిన ధోనీ.. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌కి హాజరైన గంటల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ.. ఆ టోర్నీ ముగిసిన తర్వాత ఆర్మీలో కొన్ని రోజులు పనిచేసిన ధోనీ.. ఆ తర్వాత టీమిండియా సెలక్షన్‌కి దూరంగా ఉండిపోయాడు. 


Tags:    

Similar News