Narendra Modi: జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని మోడీ
Narendra Modi: జమ్మూకశ్మీర్ చరిత్రలో అభివృద్ధి పనుల ద్వారా.. ఓ నూతన శకం ప్రారంభమైంది
జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని మోడీ
Narendra Modi: జమ్మూకశ్మీర్ ప్రజలు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు దూరమయ్యారని, అందుకే కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని ప్రధాని మోడీ వివరించారు. జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన మోడీ సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించారు. దేశంలోనే తొలి కర్బన్ రహిత పంచాయితీగా ఈ గ్రామం చరిత్ర సృష్టించిందన్నారు. రాబోయే రోజుల్లో జమ్మూకశ్మర్ కొత్త చరిత్రను లిఖించబోతోందని హామీ ఇచ్చారు. ఇన్ని ఏళ్లలో జమ్మూ కశ్మీర్‌కు కేవలం 17వేల కోట్లు పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, కానీ రెండేళ్లలో అవి 38 వేల కోట్లకు ఎగబాకిందని మోడీ తెలిపారు.