PM Modi Video Conference : మరోసారి సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్!

PM Modi Video Conference : దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో

Update: 2020-08-11 05:03 GMT
Narendra Modi (File Photo)

PM Modi Video Conference : దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ మరోసారి 9 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా అస్సోం, బీహార్‌, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, కేరళ సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో కరోనా వైరస్ నివారణ చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు ఈ వీడియో సమావేశంలో పాల్గొననున్నారు.

అటు భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 22 లక్షల 68 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 53,601 కేసులు నమోదు కాగా, 871 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 47,746 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 22,68,675 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,39,929 ఉండగా, 15,83,489 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 45,257 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 69.80 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.90 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 28.21 శాతంగా ఉంది.

Tags:    

Similar News