కోలుకుంటున్న ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌

* నిన్న ఆస్పత్రికి వెళ్లి తల్లి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని

Update: 2022-12-29 11:10 GMT

కోలుకుంటున్న ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌

Heeraben Modi: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు UN మెహతా ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్‎ను విడుదల చేశాయి. మోడీ మాతృమూర్తి నిన్న అనారోగ్యానికి గురవగా ఆమెను అహ్మదాబాద్‎లోని UN మెహతా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ నిన్ననే అహ్మదాబాద్ వెళ్లి తన తల్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ ఇటీవలే వందేళ్లు పూర్తి చేసుకున్నారు.

Tags:    

Similar News