Water Metro: దేశంలో తొలి వాటర్ మెట్రో ప్రారంభించిన మోదీ
Water Metro: కొచ్చి చుట్టుపక్కల పది దీవులను కలుపుతూ సర్వీసులు
Water Metro: దేశంలో తొలి వాటర్ మెట్రో ప్రారంభించిన మోదీ
Water Metro: ప్రధాని మోడీ కేరళలో పర్యటనలో భాగంగా దేశంలోనే తొలిసారిగా కొచ్చిలో వాటర్ మెట్రో సర్వీసులు ప్రారంభించారు . రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా ఈ ప్రాజెక్టును చేపట్టింది కేరళలోని పినరాయి విజయన్ ప్రభుత్వం. జర్మనీతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది కేరళ ప్రభుత్వం. కొచ్చి పరిసర ప్రాంతాల్లోని 10 దీవులను కలుపుతు ఈ మెట్రో సర్వీసులు ఉంటాయి.
10 దీవులను కలుపుతు 78 విద్యుత్ బోట్లు సర్వీసులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేరళ అంటేనే పర్యాటక ప్రదేశంగా పేరొందింది. అటువంటి కేరళ పర్యాటక రంగానికి ఈ వాటర్ మెట్రో మరింతగా ప్రోత్సమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర పర్యాటక రంగంలో ఈ వాటర్ మెట్రో విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందని సీఎం పినరయి విజయన్ తెలిపారు.