Prevention of Train Accidents: రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట.. కొత్త రైల్వే సిగ్నల్ వ్యవస్థలు ఏర్పాటు

Prevention of Train Accidents: ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడోచోట రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతులను వింటూనే ఉన్నాం.

Update: 2020-07-16 03:30 GMT

Prevention of Train Accidents: ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడోచోట రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతులను వింటూనే ఉన్నాం. తాజాగా రైల్వే శాఖ కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ అనే కొత్త వ్యవస్థను తీసుకురావడం ద్వారా ప్రమాదాలు నివారించే వీలుంటుందని రైలు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటి ఏర్పాటుకు లాక్ డౌన్ పీరియడ్ కలిసి వచ్చిందని చెబుతున్నారు.

ప్రమాద రహిత రైళ్ల నిర్వహణ దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. అధునాతన పరిజ్ఞానంతో రూపొందించిన ఎలకా్ట్రనిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిగ్నలింగ్‌(ఐఎల్‌ఎస్‌) వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని గుత్తి జంక్షన్‌లో దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక ఐఎల్‌ఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైలు ప్రమాదాలు, లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద మానవ తప్పిదాలను అరికట్టడానికి, సిబ్బంది వినియోగం తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. గతంలో కంటే పదింతల సామర్థ్యంతో ఈ వ్యవస్థ పనిచేయనుంది.

6,084 రైల్వే స్టేషన్లలో

2018-19 కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖ సిగ్నలింగ్‌ వ్యవస్థను పటిష్టపరచడానికి, ఎలకా్ట్రనిక్‌/ఎలక్ట్రిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థల కోసం రూ.78 వేల కోట్లను కేటాయించారు. దేశంలో 6,084 రైల్వే స్టేషన్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నంద్యాల-గుంతక ల్లు రైల్వే లైన్‌ విద్యుద్ధీకరణలో భాగంగా రూ.15 కోట్లతో ఈ సిగ్నలింగ్‌ వ్యవస్థను గుత్తి స్టేషన్‌లో ప్రారంభించారు. కొల్లంపేట-గుత్తి డబ్లింగ్‌ పనుల్లో అంతర్భాగంగా మంజూరైన గుత్తి యార్డు అభివృద్ధి కార్యక్రమాన్నీ పూర్తి చేశారు.

ప్రయోజనాలు ఇవీ

ఎలకా్ట్రనిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిగ్నలింగ్‌తో హైడెన్సిటీ రూట్లలో రైళ్లను ఖచ్చితత్వంతో నడపడమేకాకుండా, ఇప్పుడున్న రైళ్ల సంఖ్యను పెంచినా సమయపాలనతో ట్రాఫిక్‌ను నిర్వహించడానికి సాధ్యపడుతుంది. లైన్‌ కెపాసిటీ పెరగడం, సరుకు రవాణాలో యాక్జలరీ ఓవర్‌హెడ్స్‌ తగ్గించుకోవడానికి సాధ్యపడుతుంది. ఒకేలైన్‌లో రెండు రైళ్లు రాకుండా, లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరక్కుడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ వ్యవస్థలో సిగ్నళ్లను, రైల్‌ ట్రాక్‌ను, ఎల్సీలను, రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తారు. గుత్తి జంక్షన్‌లో ఇంతకు ముందు 2 క్యాబిన్లు, డిప్యూటీ స్టేషన్‌ సూపరింటెండెంటు కార్యాలయం ద్వారా రైళ్ల నియంత్రణ జరిగేది. సెంట్రల్‌ సిగ్నలింగ్‌ సిస్టం ద్వారా తక్కువ సిబ్బందితో నిర్వహించనున్నారు. అలాగే 14 హ్యాండ్‌ ఆపరేటెడ్‌ పాయింట్ల స్థానంలో మోటారు ఆపరేటెడ్‌ పాయింట్లను సమకూర్చారు.

లాక్‌డౌన్‌ సద్వినియోగం

లాక్‌డౌన్‌లో రైళ్లు నిలిచిపోవడంలో గుత్తిలో ఎలకా్ట్రనిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిగ్నలింగ్‌ పనులు వేగంగా చేయడానికి సాధ్యపడిందని డీఆర్‌ఎం, అలోక్‌ తివారి చెప్పారు. పనులను షెడ్యూల్‌ కంటే ముందే పూర్తిచేయడంలో సిబ్బందితోపాటు, ఆర్‌వీఎన్‌ఎల్‌ అధికారుల కృషి ఉందని కొనియాడారు. వ్యవస్థ వల్ల రైళ్ల ట్రాఫిక్‌ నియంత్రణ సామర్థం అభివృద్ధి చెందిందన్నారు.   

Tags:    

Similar News