పీఎం కేర్స్‌కు రాష్ట్రపతి భారీ విరాళం

Update: 2020-05-14 12:03 GMT

కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే, ప్రభుత్వాలు చేస్తున్న ఈ పోరాటానికి రాజకీయ, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు ముందుకు వచ్చి తమ వంతుగా ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయనిధులకి భారీగా విరాళాలను అందజేస్తున్నారు.

తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన వార్షిక వేతనంలో 30 శాతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా రాష్ట్రపతి ఇప్పటికే ఒక సారి పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందజేశారు. మార్చికి సంబంధించిన తన పూర్తి వేతానాన్ని పీఎం కేర్స్ నిధికి జమచేశారు. ఇప్పుడు ఏకంగా తన వార్షిక వేతనంలో సైతం 30 శాతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.


Tags:    

Similar News