Droupadi Murmu: ఢిల్లీ మెట్రోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu: దేశ రాజధాని ఢిల్లీ మెట్రోట్రైన్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
Droupadi Murmu: ఢిల్లీ మెట్రోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu: దేశ రాజధాని ఢిల్లీ మెట్రోట్రైన్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎప్పుడు రద్దీగా ఉండే మెట్రోల్ ప్రయాణించి అందరిని ఆశ్యర్యానికి గురిచేశారు. ఢిల్లీలో మెట్రో ట్రైన్‌లో ఎప్పుడు కూడా రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మెట్రోలో జనాలు కిక్కిరిసిపోయి ఉంటారు. కొన్నిసార్లు ప్లాట్ ఫామ్ మీద వెళ్లాలంటేనే రద్దీగా ఉంటుంది. అలాంటి రద్దీగా ఉన్న ప్రాంతంలో ద్రౌపతి ముర్ము వెళ్లి అందరిని షాకింగ్ కు గురిచేశారు.
మెట్రో భోగీలో ఎక్కి కొంత దూరం ప్రయాణించారు రాష్ట్రపతి ముర్ము. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్ కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు. ఈ క్రమంలో.. మెట్రో అధికారులు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మెట్రో రైలు అందిస్తున్న సేవలను గురించిన వివరించారు.