Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2025-10-24 05:45 GMT

Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మంత్రి లోకేశ్ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది గుండెలు పగిలే ఘటన అని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత ఘటనాస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు సమాచారం.

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన కలిచివేసిందని మోడీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. మృతులకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా.. గాయపడిన వారికి 50వేల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.

Tags:    

Similar News