వాళ్లిద్దరి మధ్య ఏమీ లేదట..!

West Bengal: ఒకానొక సమయంలో వాళ్లద్దరికీ అసలు పరిచయమే లేదు. ఎడమొఖం, పెడమొఖంగా ఉన్నారు.

Update: 2022-03-08 09:58 GMT

వాళ్లిద్దరి మధ్య ఏమీ లేదట..!

West Bengal: ఒకానొక సమయంలో వాళ్లద్దరికీ అసలు పరిచయమే లేదు. ఎడమొఖం, పెడమొఖంగా ఉన్నారు. వారిలో ఒకరు బీజేపీకి అంటకాగడం మరొకరికి నచ్చలేదు. కానీ అదే బీజేపీపై శత్రుత్వం వారి మధ్య స్నేహాన్ని విరబూసేలా చేసింది. అవును వారిద్దరూ ఒకరు బెంగాల్ సీఎం మమత బెనర్జీ కాగా మరొకరు ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బెంగాల్ ఎన్నికల సమయంలో బీజేపీని దెబ్బకొట్టేందుకు మమత బెనర్జీకి వ్యూహాలు రచించారు పీకే బెంగాల్ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని బీజేపీ అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించింది. కానీ వాటన్నింటినీ బెంగాల్ లోకల్ ఐడెంటినీ చూపించి కమలనాథులకు షాక్ ఇచ్చారు పీకే.

దేశమంతటా ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో మమత బెనర్జీ విజయం సాధించడంతో ఇక దీదీని నేషనల్ లెవల్ లో ఎలివేట్ చేసే వ్యూహాన్ని అమలు చేశారు ప్రశాంత్ కిషోర్ కానీ అది వర్కౌట్ కాలేదు. మమత బెనర్జీ తరపున పీకే అటు కాంగ్రెస్ పార్టీతోనూ, బీజేపీయేతర పక్షాలతోనూ చర్చలు జరిపినా అవి ఫలితాన్నివ్వలేదు. దీంతో పీకే మమతకు దూరమయ్యారని దీదీ టాస్క్ విజయవంతం చేయలేకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని తాజాగా రుజవయ్యింది. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి పీకే ఇవాళ మమత బెనర్జీ పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. అది కూడా పార్టీ కీలక సమావేశానికి పీకే హాజరయ్యారు.

అభిషేక్ బెనర్జీ ఇన్వాల్వ్మెంట్ తో పార్టీలో విభేదాలు రావడంతో పీకేను మమత పక్కనబెట్టారన్న ప్రచారం జరిగింది. అభిషేక్ బెనర్జీ వన్ మ్యాన్ వన్ పోస్ట్ నినాదంతో పార్టీలో పీకేపై విమర్శలు పెరిగాయ్. సీనియర్లు తిరుగుబాటుతో పీకే కొన్నాళ్లుగా బెంగాల్ వైపు కన్నేత్తి చూడలేదు. సోషల్ మీడియా ఎకౌంట్లను ఐప్యాక్ టీమ్ దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా విమర్శలు వెల్లువెత్తాయ్. ఐతే ఈ విమర్శలను ఐప్యాక్ కొట్టిపారేసింది. తాము కేవలం ఎన్నికల స్ట్రాటజీలు మాత్రమే అందిస్తామంది. 

Tags:    

Similar News