కాంగ్రెస్‌లో పీకే చేరిక ఖాయమేనా..? పీకే చేరిక కాంగ్రెస్‌కు ప్లస్సా ? మైనస్సా ?

Congress - Prashant Kishore: *2024 రోడ్‌మ్యాప్‌పై పీకే ప్రజెంటేషన్? *370 సీట్లపై టార్గెట్‌కు సూచనలు

Update: 2022-04-17 03:59 GMT

కాంగ్రెస్‌లో పీకే చేరిక ఖాయమేనా..? పీకే చేరిక కాంగ్రెస్‌కు ప్లస్సా ? మైనస్సా ?

Congress - Prashant Kishore: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా కాకుండా.. పార్టీలోనే చేరాలని సోనియా, రాహుల్ కోరిన మీదట ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది.

పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని.. ఇందుకు ఓ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఎన్నికల్లో 370 సీట్లే లక్ష్యంగా పని చేయాలని సూచించినట్టు సమాచారం. దీనిపై దృష్టి పెట్టినట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని పీకే సూచించినట్టు కూడా చెప్తున్నారు.

నిజానికి గతంలోనే కాంగ్రెస్, పీకే కలవాల్సి ఉన్నా.. జరగలేదు. అయితే.. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి, బీజేపీ గెలుపు నేపధ్యంలో విబేధాలు పక్కన పెట్టి కాంగ్రెస్‌లో పీకే చేరడం ఖాయమని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడాలని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో పొత్తులు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించారని తెలుస్తోంది.

పార్టీ సమాచార విభాగాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని కిశోర్‌ సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్, ప్రశాంత్ కిషర్ ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత గుజరాత్ లేదా మరే ఇతర రాష్ట్రాల్లో పీకే కు అప్పగించిన బాధ్యతకు అనుగుణంగా జరుగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల కోసమే పీకేతో జతకట్టినట్టు వార్తలొస్తున్నాయి.

Tags:    

Similar News