PPF: ఈ వ్య‌క్తుల‌కు PPF వ‌డ్డీ చెల్లించ‌దు.. మిన‌హాయింపులు ఇవ్వ‌దు.. ఎందుకంటే..

PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాని భారతదేశ పౌరుడు ఎవ్వ‌రైనా ఓపెన్ చేయ‌వ‌చ్చు

Update: 2021-10-28 16:30 GMT
Representational Image

PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాని భారతదేశ పౌరుడు ఎవ్వ‌రైనా ఓపెన్ చేయ‌వ‌చ్చు. అయితే ప్రవాస భారతీయులు (NRI) ఈ ఖాతాని ఓపెన్ చేయ‌లేరు. కానీ ఇప్పటికే వారికి ఖాతా ఉంటే దానిని కొన‌సాగించే అవ‌కాశం ఉంటుంది. ఒక పౌరుడు భారతదేశంలో నివసించి తరువాత విదేశాలకు వెళ్లి ఆ ప్రదేశంలో పౌరసత్వం పొందినా కూడా అత‌డి PPF ఖాతా ఈ దేశంలో కొన‌సాగుతూనే ఉంటుంది. అయితే ఆ ఖాతాకి కొన్ని ష‌రతులు వ‌ర్తిస్తాయి.

NRI వ్యక్తి కావాలనుకుంటే అతను భారతదేశంలో తన PPF ఖాతాను కొన‌సాగించుకోవ‌చ్చు. దీని కోసం అతను ఒక సంవత్సరంలో కనీసం 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. కానీ రిటర్న్‌లు పొందే విషయానికి వస్తే దానికి కొన్ని షరతులు వ‌ర్తిస్తాయి. మొదటి షరతు ఏమిటంటే ఆ వ్య‌క్తి భారతీయ పౌరుడు పొందే రాబడిని పొందడు. అంటే 7 శాతం వడ్డీ లభించదు. కానీ భారతదేశంలో పొదుపు ఖాతాపై లభించే వడ్డీ చెల్లిస్తారు. ఈ వడ్డీ దాదాపు 4 శాతం చొప్పున ఉంటుంది.

వడ్డీ 4 శాతం మాత్రమే

అలాగే భారతదేశంలోని PPF ఖాతాపై పన్ను మినహాయింపు NRIలకు ల‌భించ‌దు. 80C కింద పన్ను మినహాయింపు ఉండ‌దు. ఆ NRI ప్రతి సంవత్సరం తన PPF ఖాతాలో రూ. 500 డిపాజిట్ చేయాలి. తద్వారా ఖాతా మనుగడలో ఉంటుంది. NRIల కోసం PPF ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసే నియమాలు కూడా భారతీయులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. NRIలు ఖాతా తెరిచిన 7 సంవత్సరాల తర్వాత మాత్రమే డబ్బును పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. వారు 15 సంవత్సరాల త‌ర్వాత డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతా మెచ్యూరిటీ అయిన తర్వాత అంటే 15 ఏళ్ల తర్వాత మాత్రమే మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News