PPC2025: గిన్నిస్‌ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న ‘పరీక్షా పే చర్చ’

పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha 2025) అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది నిర్వహించిన ఎనిమిదవ ఎడిషన్ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది.

Update: 2025-08-04 14:38 GMT

ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ "ఎక్స్‌" (మాజీ ట్విట్టర్) ద్వారా పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఈ రికార్డు తనకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

2025లో జరిగిన ఈ కార్యక్రమానికి నెలరోజుల్లోనే సుమారు 3.53 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే 21 కోట్ల మందికి పైగా టీవీ ద్వారా వీక్షించడం వల్ల ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చూసిన విద్యా పరమైన కార్యక్రమంగా రికార్డు సృష్టించింది.

దిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గిన్నిస్‌ బృందం ఈ ఘనతకు సంబంధించిన సర్టిఫికేట్‌ను అధికారికంగా అందజేసింది. ఈ వేడుకలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, అశ్వినీ వైష్ణవ్‌, జితిన్ ప్రసాద్‌, విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, తన మంత్రిత్వ కాలంలో ఇది రెండోసారి గిన్నిస్‌ రికార్డు పొందడం జరిగిందన్నారు. మొదటిసారిగా 2015లో ఆయన పహల్‌ పథకం (ఎల్పీజీ సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా ప్రధాని మోదీకి గిన్నిస్‌ సర్టిఫికేట్ అందించినట్లు గుర్తుచేశారు.

పరీక్షా పే చర్చ కార్యక్రమం విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు సహాయపడుతోంది. ఇది కేవలం ఒక కార్య‌క్ర‌మం కాకుండా దేశవ్యాప్తంగా ఒక విద్యా పండుగగా మారిందని ఆయన తెలిపారు. అలాగే, ఇది జాతీయ విద్యా విధానం 2020 స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం 2018లో మొదలైనప్పటి నుంచి ప్రతి ఏడాది మరింత విస్తృతంగా, వినూత్నంగా కొనసాగుతూ వస్తోంది. పరీక్షలపై భయం లేకుండా విద్యార్థులు సరదాగా, ఆనందంగా అభ్యాసం చేసేందుకు ఇది మార్గదర్శకంగా నిలుస్తోంది.

Tags:    

Similar News