ఢిల్లీ, ముంబైలో రోడ్డు మధ్యలో గుంతలు
Delhi And Mumbai: ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. గుంతలో పడ్డ వాహనాలు
ఢిల్లీ, ముంబైలో రోడ్డు మధ్యలో గుంతలు
Delhi And Mumbai: ముంబయిలోని చునాభట్టి ప్రాంతంలో రోడ్డు కుంగిపోయి.. అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు గుంతలో పడిపోయాయి. రోడ్డు కుంగిపోవడం వల్ల ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఉదయం 9 గంటల సమయంలో చునాబట్టి కళాశాల దగ్గర్లో జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముందు జాగ్రత్తగా ఆ మార్గాన్ని మూసివేశారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక మున్సిపల్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టి.. గుంతలో పడిన వాహనాలను వెలికి తీశారు.
డిల్లీలో రోడ్డు కుంగిపోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. నగరంలోని జనక్‌పురి, పోసంగిపుర్ రోడ్డు మార్గంలో రాత్రి ఈ ఘటన జరిగింది. కాగా ఈ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం కలగనందున అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని.. బారికేడ్లతో రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు.