Sharad Pawar - Kishore Meet: రాష్ట్రపతి రేసులో శరద్ పవార్..!

Sharad Pawar - Kishore Meet: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ప్రశాంత్ నిర్వహించిన భేటీ జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది

Update: 2021-06-13 05:18 GMT

Sharad Pawar Prashant Kishor: (File Image)

Sharad Pawar - Prashant Kishore Meet: దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఆయన ఏ రాష్ట్రంలో కాలిడితే అక్కడ తన వ్యూహంతో తన సాయం కోరిన రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు అఖండ విజయం సాధించేలా స్ట్రాటజీలను తయారుచేసిన ప్రశాంత్ కిషోర్‌ తాజాగా రెండు రాష్ట్రాలు.. పశ్చిమాన పశ్చిమ బెంగాల్‌, దక్షిణాన తమిళనాడులో విజయం అందించిపెట్టారు. ఏపీలో జగన్ అధికారంలోకి రావడనాకి ప్రధాన కారణం ఆయనే. అయితే ఇపుడు దేశ రాజకీయాలపై దృష్టి సారించినట్లు కనపడుతోంది. 

ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ప్రశాంత్ నిర్వహించిన భేటీ జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సమావేశంతో శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు ఒక్కసారిగా వినపడుతున్నాయి. వీరిద్దిరి భేటీలో ఇదే విషయం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రశాంత్‌ కిశోర్‌ శరద్ పవార్‌కు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యమైన నాయకుడు పవార్‌ ఒక్కరే కనిపిస్తుండటం వీటికి బలం చేకూరుతోంది.

కాగా, ఇటీవల జరిగిన బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, ఇంతకుముందు జరిగిన పలు సార్వత్రిక ఎన్నికల్లో అనేక పార్టీలను విజయపంథాన నడిపించిన ప్రశాంత్ కిషోర్ కు జాతీయ రాజకీయాల్లో మంచిపట్టున్న సంగతి తెలిసిందే. అంతేకాక, 2024 లో జరిగే దేశ సార్వత్రిక ఎన్నికల్లో తన 'మిషన్-2024' కోసం ఆయన ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారనడానికి కూడా శరద్ పవార్ తో భేటీ నిదర్శనమని భావిస్తున్నారు. పవార్, కిషోర్ మధ్య సుమారు 4 గంటలపాటు జరిగిన చర్చల్లో ఇదే ప్రధాన అజెండాగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో ప్రధాని మోదీపై ఉమ్మడిగా విపక్ష అభ్యర్థిని ఎవరిని పెట్టాలన్న అంశం గురించి కూడా వీరు చర్చించినట్టు సమాచారం.

Tags:    

Similar News