ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కీలక వ్యా‌ఖ్యలు

ఆర్టికల్ 370 తాత్కాలిక ప్రొవిజన్ మాత్రమేనని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పాకిస్థాన్ నియంత్రణలో లేదని ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని ఆయన అన్నారు.

Update: 2019-10-25 14:14 GMT

ఆర్టికల్ 370 తాత్కాలిక ప్రొవిజన్ మాత్రమేనని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పాకిస్థాన్ నియంత్రణలో లేదని ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని ఆయన అన్నారు. ఆర్మీ కమాండర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఓకే , గిల్గిట్ బాల్టిస్థాన్, మొత్తం కలపి జమ్మూకశ్మీర్ రాష్ట్రం అని అన్నారు. జమ్మూ కశ్మీర్ లో  అల్లర్లు సృష్టించేందుకు పాక్ విశ్వప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.

రెండు ప్రాంతాలు పాకిస్థాన్ ఆక్రమించిందని, అయితే పీఓకేని ఉగ్రవాదుల స్థావరాలుగా మలుచుకున్నారని రావత్ తెలిపారు. జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 ఉన్నప్పుడు పాక్ అభ్యంతరాలు తెలపలేదని, ఆర్టికల్ 370 తొలిగించినప్పుడే అభ్యంతరాలు తెలుపుతోందన్నారు.  

Tags:    

Similar News