Chevella Road Accident: చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Chevella Road Accident: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2025-11-03 06:19 GMT

Chevella Road Accident: చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Chevella Road Accident: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సాయం) అందించబడుతుంది. ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

Tags:    

Similar News