మాతా వైష్ణోదేవి ఆలయ ఘటనపై మోడీ, అమిత్‌షా దిగ్ర్బాంతి.. మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియో

Mata Vaishno Devi Temple: మృతులు ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ వాసులుగా గుర్తింపు...

Update: 2022-01-01 04:45 GMT

మాతా వైష్ణోదేవి ఆలయ ఘటనపై మోడీ, అమిత్‌షా దిగ్ర్బాంతి.. మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియో

Mata Vaishno Devi Temple: న్యూ ఇయర్‌ వేళ విషాదం చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది భక్తులు చనిపోయారు,. మరో 13 మందికి గాయాలయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి భక్తులు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

మిగితా భక్తులను సరక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జమ్ము అండ్‌ కశ్మీర్ డిజీపీ దిల్‌బాస్‌ సింగ్‌ తెలిపారు. మృతులు ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని స్థానిక అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు 2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు మోడీ.

Tags:    

Similar News