Ayodhya Ram Mandir: అయోధ్యలో చారిత్రాత్మక ధ్వజారోహణం – రామమందిరంపై కాషాయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ
అయోధ్యానగరిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మరోసారి పవిత్రమైన, చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికింది. మంగళవారం జరిగిన రామమందిర ధ్వజారోహణ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది.
Ayodhya Ram Mandir: అయోధ్యలో చారిత్రాత్మక ధ్వజారోహణం – రామమందిరంపై కాషాయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ
అయోధ్యానగరిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మరోసారి పవిత్రమైన, చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికింది. మంగళవారం జరిగిన రామమందిర ధ్వజారోహణ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత రామదర్బార్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా, ప్రధాని మోదీ అయోధ్య రామాలయ నిర్మాణానికి ప్రతీకగా నిలిచే కాషాయ పతాకాన్ని ఆలయ శిఖరంపై ఎగురవేశారు. ఆలయ నిర్మాణ పనుల పూర్తి దశను సూచించే ఈ ధ్వజారోహణం, ఉదయం 11:58 గంటలకి శాస్త్రోక్తంగా నిర్వహించబడింది.
రామాలయ ప్రాంగణంలోని పలు దేవాలయాలను దర్శించిన తరువాత, మోదీ మరియు మోహన్ భగవత్ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంతో అయోధ్య రామమందిర నిర్మాణంలో చివరి అధ్యాయం పూర్తయిందని చెప్పవచ్చు.
సాంస్కృతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, జాతీయ ఐక్యత పరంగా ఈ ధ్వజారోహణం ఒక కొత్త అధ్యాయం ప్రారంభించినట్టు భావిస్తున్నారు.