ఉంఫాన్ తుఫాన్ : బెంగాల్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ!

ఒక పక్కా కరోనా కేసులతో దేశం వణుకుతున్న వేళా మరోపక్కా ఉంఫాన్ తుఫాన్ విరుచుకుపడుతోంది.

Update: 2020-05-22 05:29 GMT
PM Modi(File photo)

ఒక పక్కా కరోనా కేసులతో దేశం వణుకుతున్న వేళా మరోపక్కా ఉంఫాన్ తుఫాన్ విరుచుకుపడుతోంది.ఈ తుఫాన్ తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 72 మంది మరణించారు మరియు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారికి అక్కడి ప్రభుత్వం రెండున్నర లక్షల రూపాయలు పరిహారంగా ప్రకటిచింది. ఇక తన జీవితంలో ఇంతటి విధ్వంసాన్ని చూడలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.

ఈ ఘోర పరిస్థితిని స్వయంగా అంచనా వేసేందుకు ప్రధానమంత్రిని రాష్ట్రంలో పర్యటించాలని ఆమె కోరారు. అందులో భాగంగా ఉంఫాన్ తుఫాను వల్ల కలిగిన నష్టంపై వైమానిక సర్వే జరిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం పశ్చిమబెంగాల్‌ బయలుదేరారు. అనంతరం ఒడిశాలో ప్రధాని ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. దేశంలో లాక్ డౌన్ మొదలైన తర్వాత ప్రధాని మోడీకి ఇదే మొదటి సందర్శన కావడం విశేషం.. 

Tags:    

Similar News