PM Modi: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు (బుధవారం) కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది.

Update: 2025-12-24 05:33 GMT

PM Modi: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు (బుధవారం) కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో దేశవ్యాప్త అంశాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో సవరణలు చేసి, అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతుండగా, కేంద్ర హోం మరియు న్యాయ శాఖల పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన కేబినెట్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) ద్వారా నిధుల సమీకరణకు సహకరిస్తోంది. నేటి భేటీలో అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News