కాంటెంట్ క్రియేటర్స్‌కు WAVES awards... వేవ్స్ 2025 సదస్సులో ప్రధాని మోదీ ప్రకటన

WAVES Summit 2025: వేవ్స్ సదస్సులో ప్రధాని మోదీ చేసిన ఈ ప్రకటన కాంటెంట్ క్రియేటర్స్‌కు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వనుంది.

Update: 2025-05-01 11:23 GMT

PM Modi speech at Waves Summit 2025: కంటెంట్ క్రియేటర్స్‌కు WAVES awards... వేవ్స్ 2025 సదస్సులో ప్రధాని మోదీ ప్రకటన

PM Modi speech at Waves Summit 2025: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో జరిగిన వేవ్స్ 2025 సదస్సును ( World Audio Visual and Entertainment Summit 2025) ప్రారంభించి సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి అన్ని భాషల సినీ ప్రముఖులు, కాంటెంట్ క్రియేటర్స్ హాజరయ్యారు.

వేవ్స్ సదస్సుకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, దేశాన్ని ఆర్థికంగా పరుగులెత్తించే శక్తి కాంటెంట్ క్రియేటర్స్ కు ఉందన్నారు. అందుకే వారిని ప్రోత్సహించేందుకు రానున్న రోజుల్లో వేవ్స్ అవార్డ్స్ కూడా ప్రవేశపెడతామని ప్రకటించారు.

దేశంలో ఇలా సినీ ప్రముఖులు, కాంటెంట్ క్రియేటర్స్‌ను ఒక్కతాటిపైకి తీసుకొస్తూ వేవ్స్ సదస్సు నిర్వహించడం ఇదే మొదటిసారి. కానీ ఇకపై ఇది ఒక ఆనవాయితీగా కొనసాగించడంతో పాటు దేశ ప్రయోజనాలకు బాటలు వేసే కంటెంట్ క్రియేటర్స్‌కు వేవ్స్ అవార్డ్స్ కూడా ఇవ్వనున్నట్లు మోదీ చెప్పారు. మోదీ చేసిన ఈ ప్రకటన కాంటెంట్ క్రియేటర్స్‌కు మరింత విలువైన కాంటెంట్ క్రియేట్ చేయడంలో వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వనుంది.

కాంటెంట్ క్రియేటర్స్‌కు మరింత బూస్టింగ్‌ను ఇచ్చేలా ఈ వేవ్స్ సదస్సులో 42 ప్లీనరీ సెషన్స్, 39 బ్రేకౌట్ సెషన్స్, 32 మాస్టర్ క్లాసెస్ జరగనున్నాయి. బ్రాడ్‌కాస్టింగ్, ఇన్ఫోటెయిన్మెంట్, ఏవీజీసీ-ఎక్స్ఆర్( AVGC-XR stands for Animation, Visual Effects, Gaming, Comics), సినిమాలు, డిజిటల్ మీడియా రంగాలపై కాంటెంట్ క్రియేటర్స్ పట్టు పెంచుకునేలా ఈ సదస్సు కొనసాగనుంది. 

ఏపీకి ప్రధాని మోదీ

ఇక ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోదీ గురువారం, శుక్రవారం (మే 1, 2వ తేదీలు) మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రేపు ప్రధాని ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. రూ. 49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  

Full View

Tags:    

Similar News