ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందన: “నిబంధనలు ప్రజలను వేధించేందుకు కావు”

ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తొలిసారి స్పందించారు.

Update: 2025-12-09 06:50 GMT

PM Modi on IndiGo Crisis: Rules Are for System Improvement, Not to Trouble People

ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తొలిసారి స్పందించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యవస్థలను మెరుగుపర్చడానికే నిబంధనలు ఉన్నాయిని, అవి ప్రజలపై భారంగా మారకూడదని స్పష్టం చేశారు. ఎన్డీయే పక్ష సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

రిజిజు వివరాల ప్రకారం, “ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదు. నియమనిబంధనలు మంచివే, కానీ అవి ప్రజలను వేధించకుండా, వ్యవస్థను మరింత మెరుగుపర్చేలా ఉండాలి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సామాన్య పౌరులపై భారంగా మారే చట్టాలు, నిబంధనలు ఉండకూడదని ఆయన స్పష్టం చేసినట్లు తెలిపారు.

ఇండిగో సంక్షోభం – వేలాది ప్రయాణికులు ఇబ్బందులు

ఇండిగో సంస్థ గత వారం నుంచి భారీ అంతరాయాలను ఎదుర్కొంటోంది. రోజుకు వందల సంఖ్యలో విమానాలు రద్దవడం, అనేక సర్వీసులు తీవ్రంగా ఆలస్యమవడం వల్ల దేశవ్యాప్తంగా ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

పరిస్థితి మెరుగుపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ విమానాల కార్యకలాపాల్లో ఇంకా అంతరాయాలు కొనసాగుతూనే ఉన్నాయి.

కేంద్రం సీరియస్ – విచారణ కమిటీ ఏర్పాటు

ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇండిగో సంస్థ ప్రాథమికంగా ఈ అవాంతరాలకు ఐదు కారణాలను సూచించింది:

స్వల్ప సాంకేతిక లోపాలు

విమానాల షెడ్యూళ్ల మార్పులు

ప్రతికూల వాతావరణ పరిస్థితులు

విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ

కొత్తగా అమల్లోకి వచ్చిన FDTL Phase II రోస్టరింగ్ నియమాలు

కొత్త రోస్టరింగ్ నియమాలు ఇండిగో కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నియమాలను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News