Narendra Modi: ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోడీ
Narendra Modi: ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో మోడీ భేటీ
Narendra Modi: ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోడీ
Narendra Modi: రెండు రోజుల రష్యా పర్యటన అనంతరం భారత ప్రధాని మోడీ ఆస్ట్రియాలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా వియన్నా ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో మోడీ భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలపై ఇరు నేతలు చర్చించారు. తనకు లభించిన ఘన స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు మోడీ. భారత్- ఆస్ట్రియా పరస్పర సహకారాన్ని అందించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
రాబోయే దశాబ్దంలో సహకారం కోసం బ్లూప్రింట్‌ను తయారు చేసుకున్నామన్నారు మోడీ. క్రెయిన్ - రష్యా యుద్ధం, పశ్చిమాసియాలోని పరిస్థితులు సహా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వివాదాలపై తామిద్దరం చర్చించుకున్నామని పేర్కొన్నారు. ఇది యుద్ధ సమయం కాదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. యుద్ధభూమిలో సమస్యలు పరిష్కారం కావని అభిప్రాయపడ్డారు.