PM Modi: జమ్ముకశ్మీర్‌ రాజకీయ పార్టీలతో నేడు ప్రధాని మోడీ భేటీ

PM Modi: హాజరుకానున్న ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ * ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం తొలిసారి సమావేశమవుతున్న నేతలు

Update: 2021-06-24 03:57 GMT

అన్ని పార్టీ నేతలతో ప్రదాని మోడీ సమావేశం (ఫైల్ ఇమేజ్)

PM Modi: ఇవాళ రాజకీయంగా మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జమ్ముకాశ్మీర్‌ భవిష్యత్తుపై నేడు క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. జమ్ములోని వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఇందుకోసం అన్ని ప్రధాన పార్టీలను ప్రధాని మోడీ ఆహ్వానించారు. జమ్ము కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్దరించాలనే అంశంపై చర్చ జరగనుంది. ఈ భేటీ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో సమావేశం ప్రారంభంకానుంది. కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు 14 మందిని కేంద్రం ఈ సమావేశానికి ఆహ్వానించింది.

ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్ అబ్దుల్లా బుధవారం పార్టీల నేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా.. ఈ ప్రాంత ఐక్యత, సమగ్రత కాపాడేలా చర్యలు తీసుకునే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కశ్మీర్‌కు తిరిగి స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టాలని సమావేశంలో గట్టిగా డిమాండ్ చేస్తామన్నారు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. కశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా తిరిగి కట్టబెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇక ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి నెలకొంది.

Full View


Tags:    

Similar News